తెలంగాణ రాజ్యసభ సభ్యుల ప్రకటన

తెలంగాణా సీఎం గులాబీ బాస్ ఎట్టకేలకు ఉత్కంఠ కు తెర దింపారు . రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు . తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నడిచింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన , మాజీ మంత్రులు , కీలక నాయకులు ఆశావహుల రేసులో ఉన్నారు. రోజుకో పేరు తెరపైకి వచ్చిన ఆశావహుల్లో టెన్షన్ పెరిగింది.ఇక సీఎం కేసీఆర్ తనయ కవిత పేరు కూడా రాజ్య సభ అభ్యర్థిగా వినిపించింది . కానీ సీఎం కేసీఆర్‌ మనసులో ఏముంది..? కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను ఫైనల్ చేసిన సీఎం కేసీఆర కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగుతున్న కే.కేశవరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేశవరావుకు అవకాశం ఇస్తారా, లేదా అన్న తర్జన భర్జన కొనసాగిన వేళ ఎట్టకేలకు ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక దామోదర్ రావు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావటంతో ఆయన పేరు ఖరారు చేశారు గులాబీ బాస్ . రేపు నామినేషన్ల దాఖలు తెలంగాణలో ఖాళీ అయిన 2 స్థానాలకు ఫైనల్ గా అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. చాలా రోజులపాటు కొనసాగిన ఉత్కంఠ మధ్య నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 13 చివరి తేదీ కావటంతో నేడు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు కేకే, దామోదర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దల సభకు వెళ్లాలని అనుకున్న ఆశావహుల లిస్ట్‌ లో చాలామందే ఉన్నా రెండే స్థానాలు ఖాళీ కావటంతో సీఎం కేసీఆర్ ఆ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , అదే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పార్ధసారధి రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు పేర్లు కూడా రేసులో వినిపించాయి. కానీ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన దామోదర్‌ రావుకు సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. మొత్తానికి ఎవరికి అవకాశం ఇస్తారు అన్న టెన్షన్ కు చెక్ పెట్టి పేర్లను ప్రకటించేశారు సీఎం కేసీఆర్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *