రష్మిక అంటేనే బన్నీ ఫ్యాన్స్ భయపడుతున్నారట..

రష్మిక మందాన్న ఓ క్రేజీ హీరోయిన్. అతి తక్కువ సమయంలో అంతులేని పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే రష్మికకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉందో…అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆమె చేసే ఫోటో షూట్‌లు, షేర్ చేసే ఫోటోలు కొందరికి క్యూట్‌గా కనిపిస్తే మరికొందరికీ వెర్రి లేచినప్పుడు దిగిన ఫోటోలుగా అనిపిస్తాయి. ఇలా రెండు రకాలుగా రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.రష్మిక చేసే ట్వీట్స్ కూడా అంతే ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లో ఉంటే.. సపోర్ట్ కూడా సమపాళ్లల్లోనే ఉంటుంది. తాజాగా రష్మిక చేసే ఓ ట్వీట్ ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. హిట్లతో దూసుకుపోతోంది.. ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్స్‌తో రష్మిక ఓ రేంజ్‌లో పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా గీత పాత్రలో తెలుగు ప్రేక్షకులందర్నీ మంత్ర ముగ్దుల్ని చేసింది. ఇక మిగిలిని పాత్రలన్నింటిపైనా ఓ రేంజ్‌లో ట్రోల్స్ నడిచాయి. అతి అంటూ కామెంట్స్.. డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లోని ఆమె పాత్రను, నటనను కొందరు మెచ్చుకుంటే మరికొందరు అతి అని కామెంట్ చేశారు. మరీ ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఆమె పాత్రకు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో దారుణంగా మీమ్స్ రూపంలో ట్రోల్స్ చేశారు. డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు చేయకని కొందరంటే.. తమకు లిల్లీ లాంటి పాత్రలు కావాలని మరికొందరు అడిగారు. ఇంకొందరు అడల్డ్ పాత్రలు చేయమని కౌంటర్ ఇచ్చారు. అసలు సినిమాలే చేయకని కొందరంటే.. రష్మిక ఫ్యాన్స్ ఆ కామెంట్స్‌పై విరుచుకుపడడ్డారు. దళపతి విజయ్‌తో సినిమా చేయమని కొందరు సూచించారు. హారర్ సినిమాలు చేయండని రష్మిక వింత ఫోటోను జోడించారు ఇంకొందరు. ఇలా మొత్తానికి రష్మిక వేసిన ట్వీట్ బాగానే వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *