రేప్ బెదిరింపులతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు జైలు శిక్ష!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ వ్యవహారాన్ని హీరోయిన్ మీరా చోప్రా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. తనకు లభిస్తున్న ప్రతీ మద్దతును కూడగట్టుకొంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెంచుతున్నది. మంగళవారం రాత్రి నుంచి చాలా పకడ్బందీగా పావులు కదుపుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యేలా, మీడియా అటెన్షన్‌ను ఆకర్షించేలా కదిపిన పావులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారనే విషయం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక ఏ స్త్రీని బెదిరించలేరు.. మరో షాకింగ్ ట్వీట్ చేసిన మీరా చోప్రా!దూకుడు ఆపని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా ఒకవైపు తీవ్రంగా హెచ్చరిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ దూకుడును ఆపకపోవడంతో కేసులు పెట్టేదాక ఈ వ్యవహారం వెళ్లింది. అతడికి ఫ్యాన్స్ చేసిన ట్వీట్స్, బెదిరింపులను ఎన్టీఆర్‌కు తెలియడానికే తాను ట్యాగ్ చేసానని, అతడు తన ఫ్యాన్స్ చేసిన నిర్వాకం గురించి స్పందించాలని సూచించింది. బుధవారం పలుచోట్ల కేసులు ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై మీరా చోప్రా చేసిన ఫిర్యాదుల మేరకు బుధవారం ఉదయమే పలు చోట్ల చకచకా కేసులు నమోదయ్యాయి. మీరా రిక్వెస్ట్‌కు స్పందించి జాతీయ మహిళా కమిషన్ కేసు ఫైల్ చేసింది. అలాగు హైదరాబాద్ సిటీ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగాలు కూడా కేసులు నమోదు చేసి రంగంలోకి దిగాయిమీరా చోప్రాను ఉద్దేశించి గ్యాంగ్ రేప్, యాసిడ్ ఎటాక్, హత్య చేస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన వీరంగం ఇప్పడు చట్టాల పరిధిలోకి వెళ్లింది. పోలీసులు, మహిళా సంఘాలు ఈ వ్యవహారన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. సోషల్ మీడియా పురుషులకు వినోద క్రీడగా మారితే.. స్త్రీలకు మాత్రం చాలా దుర్బరమైన పరిస్థితులు కల్పిస్తున్నాయనే వాదన వినిపిస్తున్నది. పోలీసులకు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మీరా చోప్రా నుంచి వస్తున్నది. తనపై ట్రోలింగ్ ‌కు పాల్పడిన అకౌంట్ల వివరాలను పోలీసులకు, ఇతర మహిళా సంఘాలకు అందజేసింది. వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని ట్విట్టర్‌లో మీరా చోప్రా వేడుకొన్నది. ఈ క్రమంలో మీరా చోప్రాను అసభ్యంగా దూషించిన వారికి జైలు శిక్ష తప్పదనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చపై యంగ టైగర్ ఎన్టీఆర్ ఇంత వరకు స్పందించలేదు. కానీ మీరా చోప్రా వ్యూహం మాత్రం అతడిని ఆత్మరక్షణలో పడేసినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ను తమ ట్రోల్స్ ఆపమని చెప్పి కంట్రోల్ చేయడం కష్టమైన పనే. ఒకవేళ తన అభిమానులకు ఏదైనా మెసేజ్ సోషల్ మీడియా ద్వారా ఇస్తే వర్కవుట్ అవుతుందా? లేక తన అభిమానులు చేసిన తప్పుకు ఎన్టీఆర్ ఒప్పుకొన్నట్టు అవుతుందా? అనే కోణంలో వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ఎన్టీఆర్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *