వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రికార్డులన్నీ పక్కకు

పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో మరో సారి చూపించాడు. ఇలా వచ్చాడు అలా రికార్డులన్నీ తుడిచేస్తున్నాడు. కేవలం లీకైన పిక్ సోషల్ మీడియాను ఊపేయడం అంటే అది ఒక్క పవర్ స్టార్‌కే చెల్లింది. లీకైన పిక్ టీ షర్ట్స్ మీద ప్రింట్ చేసి అమ్మితే క్షణాల్లో స్టాక అవ్వడం ఒకెత్తు అయితే..ఏకంగా టైటిల్‌లో కూడా అదే పిక్‌ను వాడారంటే ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోచ్చు. నిన్న రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

. వకీల్ సాబ్ అనే టైటిల్ పెడతారని ముందు నుంచే లీకులు అందడంతో అదంతా పెద్ద సర్‌ప్రైజింగ్ అనిపించకపోయినా.. అందులో పెట్టిన ఇమేజ్, రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. అసలే ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డులన్నీ పక్కకి జరిగాయి.

వకీల్ సాబ్ పాటపై త్రివిక్రమ్ ప్రశంసలు, వాటిని రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌లో పేర్కొనడం చూస్తుంటే ఫస్ట్ సింగిల్ వచ్చి యూబ్యూబ్ రికార్డులన్నింటిని బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. వకీల్ సాబ్ ఫస్ట్ సింగిల్ నిలిచిపోయే పాట అవుందని చెప్పారంటూ రామ్‌జో ట్వీట్ చేశాడు. రికార్డులు బద్దలు.. ఒక్క రోజులో వకీల్ సాబ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తెలుగు సినిమా రికార్డులన్నింటిని బద్దలు కొట్టేసింది. ట్విట్టర్‌లో అత్యధికంగా మంది (25.3 వేలు) రీట్వీట్ చేయగా.. వకీల్ సాబ్ అంటూ అత్యధిక మంది (35లక్షలు) వీక్షించారు. ఇలాంటి రికార్డులు మరే తెలుగు హీరోకు లేవని పవన్ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *