1000 కేజీల‌ గంజాయి ప‌ట్టివేత‌


ఓడిస్సాలోని గ‌జ‌ప‌తి జిల్లాలో అక్ర‌మంగా ర‌వాణ చేస్తున్న వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు ప‌ట్ట‌కున్నారు. ఉదయగిరి జిల్లా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి ఉల్లిగడ్డలో లోడ్‌తో వెళుతున్న ట్రక్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఉల్లిగడ్డలతో పాటు 1,056 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు వివరించారు. నిఖిల్‌కుమార్‌, అనురాగ్‌ అనే ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.50లక్షలు ఉంటుందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *