24గంట‌ల్లో ఢిల్లీలో 1,118 క‌రోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుంది.గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 1,118 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1201 మంది మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 26 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలో 1,36,716 మంది కరోనా బారినపడగా 1,22,131 మంది చికిత్సకు కోలుకున్నారు. 10,596 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండగా 3,989 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బులిటెన్లో వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *