విమానం లో అయ్యోద్య బయలుదేరిన ప్రధాని

దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. రామమందిరం నిర్మాణాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు.

ఇక అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్ డేట్ మీకోసం ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్య సింగారించుకుంటోంది.. సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతోంది. భక్తిపూరక వాతావరణాన్ని అణువణువునా నింపుకొంటోంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఎటు చూసినా కాషాయ జెండాలు దర్శనం ఇస్తున్నాయి. జైశ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సాధువులతో నగరం క్రమంగా నిండిపోతోంది. శ్రీరామచంద్రుడి భక్తులు ఒక్కొక్కరుగా అయోధ్యకు చేరుకుంటున్నారు. చాలామంది కాలి నడకన, చెప్పులు లేకుండా రావడం కనిపిస్తోంది. ఏ ఒక్కరిని పలకరించినా.. జైశ్రీరామ్ అంటూ సమాధానం ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *