సివిల్ సర్వీసెస్ మౌఖిక పరీక్షల్లో మహేష్ భగవత్ తర్ఫీదు తో అత్యుత్తమ ఫలితాలు

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మౌఖిక పరీక్షలో మెలుకువలు నేర్పడం తో పాటు మనోధైర్యం నింపుతూ సన్నద్ధతకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మభూషణ్ కే .పద్మనాభయ్య పేర్కొన్నారు.సివిల్ సర్వీస్ 2019 పరీక్షలలో విజేతలైన 15 మంది ది సివిల్ సర్వెంట్లకు గురువారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసుల లోకి వచ్చేవారు పదవి అలంకారం అని చూడకుండా సమాజ హితం కోసం పని చేయాలన్నారు 35 ఏళ్ళ సర్వీసులో ఇతర శాఖల అధికారులతో వివిధ సర్వీసులో ఉన్న వారితో సఖ్యత సమన్వయం చేసుకుంటూ మెళకువలు నేర్చుకుంటూ ఆదర్శవంతమైన పాలనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు .
విధినిర్వహణలో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతూ జనరంజక పాలన తో జనం మెచ్చిన అధికారిగా ప్రజల మనసులలో చోటు దక్కించుకోవాలని కాబోయే సివిల్ సర్వెంట్లకు పద్మనాభయ్య అనేక సూచనలు చేశారు

మరో ముఖ్య అతిథి ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సాధు నర్సింహారెడ్డి మాట్లాడుతూ సర్వీసు ఆఖరివరకు వృత్తి ధర్మం తో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. విధినిర్వహణలో నిస్వార్ధంగా పనిచేసేందుకు సీపీ మహేష్ భగవత్ ఇలాంటి అధికారులను రోల్ మోడల్ గా తీసుకోవాలన్నారు.

2019 సివిల్ సర్వీస్ మౌఖిక పరీక్షల్లో మహేష్ భగవత్ సారధ్యంలో ఇచ్చినతర్ఫీదు తో 120 మంది విజేతలుగా నిలువగా అందులో మహారాష్ట్ర కు సంబంధించిన 70 మంది , తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు చెందిన 55 మంది విజేతలుగా నిలిచారన్నారు.
అందులో ల14 మంది 100 లోపు ర్యాంకు లతో నిలబడడం సంతోషకరం ,స్ఫూర్తిదాయకమని సాధు నరసింహారెడ్డి పేర్కొన్నారు.

పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఓర్పు సహనం అన్నిటికీ మించి ఏకాగ్రతతో కూడిన పట్టుదలతో అభ్యర్థులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కఠోరమైన శ్రమతో అద్భుతాలు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా సిపివారి కృషిని కొనియాడారు.దాత్రి రెడ్డి 46 ర్యాంకు, సూర్య తేజ 76, రవితేజ 77 ,సత్య సాయి కార్తీక్ 103 , మకరంద్ 110 ,ప్రేమ్ సాగర్ 170 ,సత్య ప్రకాష్ 218, సందీప్ 244, రాహుల్ 272 ,సంకీర్త్ 330, మౌర్య కృష్ణ చంద్రశేఖర్ 470, సత్య ధర్మ ప్రతాప్ 510 ,విజయ కాంత్ 516 ,రజినీకాంత్ 598 ,శశికాంత్ 764 విజేతలకు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య సాధు నరసింహారెడ్డి డి.సి.పి మహేష్ భగవత్ లు ఘనంగా సన్మానం చేశారు.

తల్లిదండ్రులు గురువుల తో పాటు స్నేహితుల కృషి ప్రోద్బలం తోనే తాము ఇంతగా రాణించామని వారి కృషి వెలకట్టలేనిది అని పలువురు విజేతలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో లో మల్కాజ్గిరి డిసిపి రక్షిత కృష్ణమూర్తి ,అడిషనల్ డిసిపి శిల్ప వల్లి, సివిల్ సర్వీస్ విజేతల తల్లిదండ్రులు ,బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *