టాలీవుడ్‌లో హాట్‌టాపిగా మారిన దీపిక పారితోషికం


బాలీవుడ్‌లో అగ్ర‌తార‌గా వెలుగొందుతున్న దీపిక ప‌దుకొణే ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్ 21 చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.ఈ మెను తెలుగులోన‌టింప‌చేయ‌డానికి చాలా మంది డైరెక్ట‌ర్లు గ‌తంలో ప్ర‌య‌త్నించి విఫ‌లల‌మయ్యారు కాని ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ మాత్రం స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆమె తీసుకునే పారితోషికం విషయమే పెద్ద డిస్కషన్ అవుతోంది. ఇప్పటివరకు హిందీలో ఆమె ఒక్కో చిత్రానికి 15 కోట్లకు కాస్త అటూ ఇటూగా తీసుకుంటున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే, తెలుగులో నటించడానికి మాత్రం ఆమె 25 కోట్లు తీసుకుంటోందని కొందరు.. కాదు.. 30 కోట్లని మరికొందరు .. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజక్టుకి 20 కోట్ల పారితోషికానికి ఆమెను నిర్మాతలు ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *