సుశాంత్ ఆత్మహత్య నుంచి ఇంకా కోలుకోని బాలీవుడ్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నుంచి ఇంకా సినీ పరిశ్రమ కోలుకోలేదు. ఆయన బలవన్మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసు విచారణను ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. పలువురు సినీ ప్రముఖులను వారు విచారిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా భన్సాలీ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.సుశాంత్ సింగ్ కు సినిమా ఆఫర్లను ఇచ్చాను… కానీ, డేట్స్ సమస్య వల్ల ఇద్దరం కలిసి పని చేయలేకపోయామని పోలీసులకు భన్సాలీ తెలిపారు. మరోవైపు సుశాంత్ చనిపోయిన తర్వాత భన్సాలీ ఎంతో ఆవేదనకు గురయ్యారు. నీవెంత బాధ పడ్డావో తనకు తెలుసని సుశాంత్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. నిన్ను అణచివేసిన వ్యక్తుల గురించి తనకు తెలుసని అన్నారు. నీ బాధను చెప్పుకుంటూ నా భుజంపై తల పెట్టి ఏడ్చిన ఘటనను మర్చిపోలేనని చెప్పారు. ఇదంతా వాళ్ల కర్మ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *