Dubbaka మళ్లీ BJP ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెరాస, భాజపా మధ్య దోబూచులాడుతోంది. రౌండ్‌ రౌండ్‌కూ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 21వ రౌండ్‌లో భాజపా ఓట్ల 380 ఆధిక్యం ప్రదర్శించింది. మొత్తం 21 రౌండ్లు ముగిసే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 620 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ఐదు రౌండ్లతోపాటు 8, 9, 11, 20,21 రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. 6, 7, 10, 13, 14, 15, 16, 17, 18 19 రౌండ్లలో తెరాస, 12వ రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం సాధించాయి. మొత్తం ఇప్పటి వరకు భాజపాకు 55,733, తెరాసకు 55,493 కాంగ్రెస్‌కు19,423 ఓట్లు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *