మన్నార్ గుడి ఆలయంలో ఏనుగుకు ప్రత్యేక హెయిర్ స్టయిల్

మన్నార్ గుడి ఆలయంలో ఏనుగుకు ప్రత్యేక హెయిర్ స్టయిల్
మన్నార్ గుడి ఆలయంలో ఏనుగుకు ప్రత్యేక హెయిర్ స్టయిల్ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ఏనుగు గుడికి వ‌చ్చేవారిని ఎంత‌గానో ఆక‌ర్శిస్తుంది. త‌మిళ‌నాడు రాష్ట్ర గుడుల‌కు చాలా ప్ర‌సిద్ది అక్క‌డ చాలా ఆల‌యాల‌లో ఆస్థాన కార్య‌క్ర‌మాల కోసంఏనుగున‌లు పోషిస్తుంటారు. కాని ఈ ఏనుగు ఇత‌ర ఏనుగ‌లలా కాకుండా కాస్త విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర ఏనుగులకు భిన్నంగా ‘సెంగమాలమ్’ చక్కని హెయిర్ స్టయిల్ తో దర్శనమిస్తుంది. అది కూడా బాబ్డ్ కట్ మరి! తన ముఖానికి సరిపోయే క్రాఫింగుతో ఆ ఏనుగు అందం చూడాల్సిందే. దీనికి ఇంటర్నెట్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘సెంగమాలమ్’ ఫొటో పోస్టు చేస్తే చాలు… లైకులు పోటెత్తుతాయి. బాబ్డ్ కట్ ‘సెంగమాలమ్’ అంటే సామాజిక మాధ్యమాల్లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ‘సెంగమాలమ్’ స్వస్థలం కేరళ. అయితే 2003లో దాన్ని మన్నార్ గుడి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దీని మావటి రాజగోపాల్ దీనికి ప్రత్యేకమైన క్రాఫ్ చేసి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాడు. ముఖంపై తిరునామాలు, ఆపైన అందమైన హెయిర్ స్టయిల్… ‘సెంగమాలమ్’ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *