ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌ల పెంప‌కంలో భాగ‌స్వాములు కావాలి


ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌ల పెంప‌కంలో భాగస్వాములు కావాల‌ని మంత్రి హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. శ‌నివారం సిద్దిపేట జిల్లా అడ‌వుల్లో ప‌చ్ఛ‌ద‌నం పెంచేందుకు వినూత్న ప్ర‌య‌త్నం చేప‌ట్టారు. అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్నిమంత్రి హ‌రీష్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూఇప్ప‌టికే ఢిల్లీ లాంటి ఏరియాల్లో ఆక్సిజ‌న్‌ను కొనే ప‌రిస్థితి వ‌చ్చింది. ఒక్కో మ‌నిషి 3 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను కొంటున్నాడు. ఒక్కో సిలిండ‌ర్ ఖ‌ర్చు రూ. 700, ఈ లెక్క‌న మూడు సిలిండ‌ర్ల‌కు రూ. 2,100 ఖ‌ర్చు అవుతుంది. మొత్తంగా ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేస్తే.. రూ. 5 కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథులుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య‌, ఆయ‌న స‌తీమ‌ణి పాల్గొన్నారు.


3 కోట్ల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య స్ప‌ష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అడ‌వుల్లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన వ‌న‌జీవి దంప‌తుల‌కు మంత్రి హ‌రీష్‌రావు శ‌నివారం ఉద‌యం అల్పాహారం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా రామ‌య్య‌తో మంత్రి ముచ్చ‌టించి ఆయ‌న జీవన‌స్థితిగ‌తుల గురించి ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *