లిక్కర్ మాఫియాకు కోరలు


కరోనా వ్యాప్తి ప్రతిరోజు అంతకంతకూ పెరిగిపోతోంటే ఏపీలో మాత్రం లిక్క‌ర్ మాఫియాక్ కోర‌లు వ‌చ్చాయ‌ని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. ‘వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా కోరలు చాచింది. ఒక పక్క కరోనా బారిన పడి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రతి రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా జగన్ రెడ్డి గారి ధన దాహం తీరడం లేదు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
‘రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో 25 వేల కోట్ల రూపాయల జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నారు. కరోనా వ్యాప్తికి నిలయాలుగా మారుతున్న జగన్ మద్యం దుకాణాలు తక్షణం మూసివేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *