ఊసాను మింగిన కరోనాపై కసితో పోరాడుదాం!


మిత్రులారా!రేపు యుద్ధంలో కత్తి కాటుకు గురయ్యేది మనమే కావచ్చును.మరణం మనల్ని బలి తీసుకోవచ్చు. కానీ యుద్ధ సైనికులుగా…ఉద్యమకారులుగా నిరంతరం శారీరక దృఢత్వాన్ని నిలిపివుంచుకోవాలి.యుద్ధం చేయడానికి మొదటి అర్హత అది.చచ్చేదానికి ఫిట్నెస్ ఎందుకు అనుకోవడంగాని ఏమరుపాటుగాని తగదు.అయితే మరీ మన పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది. మనం మన ముందు తరాలు పోరాట బాటలు వెతుకుతు దొరికిన బాటలో కొట్లాడుతూ అలిసిపోయినమని అనుకుందామ మనకు ఆరోగ్య సృహ లేదనుకుందామ. నా ఉద్దేశ్యంలో రెండోదే అని చెప్పడానికి బాధగా ఉంది.ఆరోగ్యం ప్రధానమా కాదా అనేది మన మహనీయులు బుద్ధ పూలే అంబేత్కర్ ల అనుభవాల నుండి నేర్చుకోవాలి.ఒక అవగాహనకు రావాల్సి ఉంది.మహనీయుడు బుద్ధుడు దృఢకాయుడు.బౌద్ధం అనేక యుద్ధరీతుల్ని ఆవిష్కరించింది.మహాత్మా జ్యోతిబా పూలే తన మీదికి దాడికి అగ్రకులాలు పంపినవారిని లొంగతీసుకుని వారిని తన శిష్యులుగా చేసు కున్నా డు. మహనీయులు అంబేత్కర్ నాటికి చుట్టూ శత్రువులు.అధ్యయనం,రాయడం,పోరాటం అన్ని తానే. తన ఆరోగ్యాన్ని పట్టించుకునే సమయమే లేదు.తన భార్య బిడ్డలను కూడా పట్టించుకోలేని పరిస్థితి నాడు నెలకొని ఉంది.ఆ మహనీయుడు ఎటు తిరిగితే అటు శత్రువులు.చివరికి ఇంటిలోకి జీవితంలోనికి ప్రవేశించిన శత్రువు.మరణం అనారోగ్యంతోనని ప్రకటన.అనారోగ్యం అనుమానాస్పదమే.మహనీయులు అంబేత్కర్ నాడు ఉన్న పరిస్థితులు నేడు లేవు.ఆ మహనీయుడు ఎంతో కొంత చదును చేసి మనకు అందించాడు.ఇంకొంత కాలమైన ఆ మహనీయుడు బతికివుంటే బాగుండని అనుకోని బహుజన హృదయముంటుందా! మన ముందు తరం మరోజు వీరన్నకు వర్గ కుల సిద్ధాంత తోడుగా నిలిచి మన తరానికి ఉపద్యాయుడుగా తెలంగాణ రాష్ట్ర సాధన బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా ఊసా నిర్వహించిన పాత్ర చారిత్రక మైనది.బ్రామ్మన కోడూరు నుండి ప్రారంభమైన తన జీవన యాత్ర కారంచేడు చుండూరు నీరుగొండ…ల మీదుగా కొండమొదలు,తెలంగాణలో మోత్కూరు హైదరాబాద్ ల వరకు అత్యంత దుర్మార్గులైన సీమాంద్ర కమ్మ పాలకులతో నిరంతరం రాజీ లేని పోరాటాలు జరిపిండు.ఎదురీత పత్రిక విప్లవ ఉద్యమాల్లోనే ఒక సంచలనం.నేను ఒక రోజు అనుకోకుండా ఎదురీత పత్రిక కొనుక్కుని తీసుకెళ్లి చదువుతుంటే మా భాద్యుడు బెదిరించిన పరిస్థితి. అట్లాంటిది కా,,వీరన్న ఒక స్పష్టమైన వర్గ కుల సిద్ధాంత మార్గాన్ని ఎంచుకోవడంతో ఊసా వర్గ కుల సిద్ధాంత గ్రంధము కూర్పు మరియు కుల ఉద్యమాలకు ఉపాధ్యాయుడిగా శక్తి వంచన లేకుండా కృషి చేశాడు.సీమాంధ్ర పాలకులు వీరన్నను బలి తీసుకోవడం, నేను కొరియర్గా ఉండడంతో కొందరు నా పై చేసిన దుష్ప్రచారం వల్ల నాటినుండి ప్రజాగాయకుడు గద్దర్ నాయకత్వంలో మహాజన సమాజం ఏర్పాటు వరకు అప్పుడప్పుడు సభల్లో ఎదురుపడేవాళ్ళం.నేను నమస్కరించినా నామీద అతనికి నా వ్యతిరేకులు ఏర్పరచిన దురభిప్రాయం వల్ల నేను చాలా కోల్పోయాను. ఏదేమైనా ఏనాటికైనా కలిసే అవకాశం వస్తుందని ఆశించి బంగపడ్డాను.నా ఏకలవ్యగురువు వెళ్ళిపోయిండు.కరోనా రక్కసి బలి తీసుకుంది.ఏంచేయగలను.కరోనా మీద పగ తీర్చుకోవడం తప్ప.మొదట తెలంగాణ ఉద్యమకారుడు నిస్సార్ను బలి తీసుకుంది.తనొచ్చింది ఉద్యమ నాయకుల్ని బలి తీసుకోవడానికేనన్నట్టు,వలిగే ప్రభాకర్ మరికొందరు మిత్రులను మరణం అంచుల వరకు తీసుకెల్లింది.మరింత మంది ఉద్యమకారుల కాళ్ళు చేతులు కట్టేసింది.ఇటువంటి సందర్భాల్లో ఉద్యమకారులుగా నిస్సహాయంగా మిగిలిపోవాల్సిందేనా.ఊసా,నిస్సార్ లను స్మరించుకుంటూ మరింత కసిగా యుద్ధం చేయడమా మన ముందు రెండే మార్గాలు.కరోనా ఇది ఏ తెలంగాణ, లేదా భారత్ కో పరిమితం కాదు.అంతర్జాతీయంగా మారుతున్న సామ్రాజ్యవాద పెట్టుబడి వైరుధ్యాల ఫలితంగా దీన్ని అర్థం చేరుకోవాలి.గత కాలంలో సామ్రాజ్యవాద దేశాల ఎజెంటుగా ప్రపంచ బ్యాంకు క్రియాశీలంగా ఉండగా నేడు ఆపాత్రను who పోషిస్తుంది.ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా రష్యాలు ప్రత్యర్థులుగా సయ్యటలాడితే నేడు రష్యా ప్లేస్ ను చైనా ఆక్రమించింది.మళ్ళీ ఒక ప్రచ్ఛన్న యుద్ధం దాపురించింది.అమెరికా చైనా సయ్యాటలు ప్రపంచ పేద దేశాలు బలయిపోయే పరిస్తితి. గతంలో లాగానే ఈ దేశ పాలక వర్గ కులాలు ఏదో ఒక దేశానికి ఎజెంటుగా వుంటూ దేశ ప్రజల్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి.దేశీయ ఆరోగ్య విధానాలను అణచివేస్తూ ప్రజారోగ్యాన్ని తద్వారా ప్రజా జీవనాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి.కాబట్టి నేడు ఉద్యమకారులు స్పష్టతకు రావాలి.కరోనా గురించిన ఎరుక అందరికి కొత్తనే.వైద్యుల మీద వదిలేసి కూసుంటే కుదరదు. ఉద్యమకారులే వైద్యులు కావాలె.ప్రజలకు ఆరోగ్య భరోసా కావాలి.ఊసా ను బలి తీసుకున్న కరోనాను కాట్లో తొక్కాలి.ఊసా అమర్ర హే. వందనాలతో బత్తుల సిద్దేశ్వర్లు,9704672813

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *