సీఎం ప‌ర్య‌ట‌న‌కు హాజ‌ర‌య్యే ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా టెస్టులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన ఇడుపులపాయ వెళుతున్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌నప‌ర్య‌ట‌న‌లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. అలాగే క‌ట్టుదిట్ట‌మైన భ్ర‌ద‌త ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు
ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఐఎస్ డబ్ల్యూ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ, సీఎం పర్యటనకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు చేయాలని నిర్ణయించామని, కొవిడ్-19 స్వాబ్ టెస్ట్ చేయించుకున్న వారికే ఈ పర్యటనలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం పర్యటనలో స్డాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (ఎస్ఓపీ) తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు.

The Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy calling on the Prime Minister, Shri Narendra Modi, in New Delhi on August 06, 2019.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *