కెసిఆర్ పెద్ద రాజ‌కీయ‌కుట్ర‌దారుడు


కెసిఆర్ పెద్ద రాజ‌కీయ‌కుట్ర‌దారుడ‌ని సిఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు.సోమ‌వారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్అన్నారు. సిఎంను విమర్శించే వాళ్లను అరెస్టు చేయిస్తున్నారు.

‘దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోంది. భారత రాజ్యాంగాన్ని బిజెపి అపహాస్యం చేస్తోంది. గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్.. ఇవాళ రాజస్థాన్‌లో రాజకీయ కుట్రలకు తెర లేపింది. రాజస్థాన్ గవర్నర్ దిల్లీకి దాసోహం అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది’అని ఆయ‌న అన్నారు.

 

రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలను కొని అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారుభాజపా వైఖరిని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసన చేపట్టాం. కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు’అని ఎంపీ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
రాజ్భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను గాంధీ భవన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్ ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *