పట్టు కోసం మెట్లు దిగుతున్న కేసీఆర్

ఎక్కువ సీట్ల కోసం మజ్లిస్ డిమాండ్ చేసే ఛాన్స్ హైదరాబాద్లో బలమైన ఓటు బ్యాంకు గల మజ్లిస్ పార్టీ గత ఎన్నికలలో కంటే అధిక సీట్లు పొత్తులో భాగంగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉండటం, మొన్న దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడం , అదే సమయంలో బీహార్లో మజ్లిస్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకొని తన బలాన్ని నిరూపించుకోవడం వంటి కారణాలు మజ్లిస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేయడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. పొత్తు కుదరాలంటే సీఎం కేసీఆర్ ఒక మెట్టు దిగక తప్పదా ! దుబ్బాకలో ఓటమితో, సీఎం కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో సీరియస్ గానే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీతో తప్పకుండా పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ తో భేటీ అయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *