రాజ‌కీయాల‌లో కొత్త ట్రెండ్ సెట్ట‌ర్ కేటిఆర్


రాజ‌కీయాల‌లో కొత్త ట్రెండ్ సెట్ట‌ర్ కేటిఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్ జన్మదినం సంద‌ర్భంగా శుక్రవారం ప్రగతి భవన్లో ఆయ‌న‌ కేటీఆర్ ను కలిసి మొక్క ను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రిగా, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స‌క్సెస్ అయ్యార‌న్నారు. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకునే యూత్ కి కేటీఆర్ ఐకాన్ గా మారార‌న్నారు. ఆయన రాజ‌కీయ జీవితం సుదీర్ఘంగా సాగాల‌ని, నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *