జగన్ సర్కార్‌కు డెడ్‌లైన్:

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు తూర్పు శాసన సభ్యుడ ముస్తఫా సొంత ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. డెడ్‌లైన్ కూడా విధించారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించాలని అన్నారు. అలా చేయకపోతే తాను రాజీనామా చేస్తాననీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *