జడ్జర్ల రహదారి పై లారీ బీభత్సం

మహాబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల వద్ద జాతీయ రహదారి పై అదుపు తప్పిన ఓ లారీ రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకువెళ్లడం తో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా వస్తున్న లారీ ఈ ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసేలోగానే పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోవడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా కలకలం రేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *