విమానంలో చైనా వ్యక్తి వాంతులు

నా నుంచి ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ఆయా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారతీయులకు కూడా వ్యాప్తి చెందుతోందని  ప్రజలకు  ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి పుణె వెళ్లున్నఎయిర్‌ ఇండియా విమానంలో చైనాకు చెందిన వ్యక్తి(31) రెండు సార్లు వాంతులు చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది పూణె విమానశ్రయానికి చేరుకోగానే. మున్సిపల్‌ కార్పొరేషన్‌ నాయుడు ఆస్పత్రికి తరలించి అక్కడ ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అతని నమూనాలు సేకరించి వాటిని పూణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు(ఎన్‌ఐవీ) పంపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *