సెక్రటేరియట్ కు జగన్.. భారీగా పోలీసులు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు అమరావతిలోని సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. మరోవైపు, రాజధానిని తరలించరాదని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సీఎం ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మందడంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి వద్ద పోలీసులు నిలబడ్డారు. రైతుల శిబిరం వద్ద ఎవరూ రోడ్డుపైకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొత్త శిబిరంలో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాత శిబిరంలోనే నిరసనలు కొనసాగించాలని రైతులకు పోలీసులు సూచించారు. మరోవైపు, శాంతియుతంగా తాము చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *