హ్యాట్రిక్‌ రికార్డా.. విన్నింగ్‌ రికార్డా?

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన తర్వాత ఫుల్‌ జోష్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన టీమిండియాకు ఊహించని షాక్‌ తగలింది. కచ్చితంగా తొలి వన్డే కూడా మనదే అనుకున్న సమయంలో కివీస్‌ రెచ్చిపోయింది. విరాట్‌ అండ్‌ గ్యాంగ్‌  నిర్దేశించిన 348 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉఫ్‌ అని ఊదేసింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. మొదటి వన్డేలో సాధించిన ఘన విజయం కివీస్‌కు  సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అదే ఊపును రెండో వన్డేలో కూడా కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే తలంపుతో న్యూజిలాండ్‌ తమ ప్రణాళికలకు పదును పెడుతుండగా, ఎలాగైనా మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కడవరకూ తీసుకురావాలని టీమిండియా చూస్తోంది. శనివారం ఆక్లాండ్‌ వేదికగా  జరుగనున్న రెండో వన్డేలో ఇరు జట్లు తమ బలాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి సన్నద్దమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *