రేష‌న్ బియ్యం ప‌ట్టివేత

రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌రాన విశ్వ‌నీయ స‌మాచారం మేర‌కు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వెంకటస్వామి, ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి , ఎస్సై రాము , టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐలు రఘు, ప్రసాద్, సిబ్బంది ఖమ్మం రూరల్ మండలం ముల్కలపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో AP-01, W 6184 లారీలో Rs. 2,70,000 / – విలువ చేసే సుమారు 100 క్వింటాల్స్ పిడిఎస్ బియ్యాన్ని నిబంధనలు అతిక్రమించి మహబూబాబాద్‌ జిల్లా అలెరూ గ్రామం నుంచి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని యానాం కు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ మరియు యజమాని అయిన కందిమల్లా శ్రీనివాస్, లారీ క్లీనర్ గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు .
ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో TS 04, VC 5875 లారీలో PDS బియ్యాన్ని లోడ్ చేసిన్నట్లు సమాచారంతో అక్కడకు చేరుకున్న టాస్క్ ఫోర్స్ బృందాన్ని చూసి డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు.
పిడిఎస్ బియ్యంతో ఉన్న లారీని ఎస్‌హెచ్‌ఓ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.తనిఖీల్లోకానిస్టేబుళ్లు శ్రీనివాస్ రెడ్డి, కళింగారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్, రవి, కోటేశ్వర్, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *