ప‌వ‌ర్‌స్టార్ వివాదం వెన‌క్కి త‌గ్గిన ఆర్జీవి


సినిమా ఇండ‌స్ట్రీలో వివాదాల‌కు మారుపేరుగా ఆర్జీవి నిలిచిపోయారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న చాలా వ‌ర‌కు నిజ‌జీవిత చ‌రిత్ర‌ల‌ను ఆధారంగా సినిమాలు తీస్తున్నారు. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద ప‌వ‌ర్ స్టార్ అనే సినిమాను తీసి త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోతున్నాడు.

దీంతో నిన్న‌రాత్రి ఆయ‌న కార్యాల‌యంపై దాడి జ‌రిగింది.ఆయ‌న స‌న్నిహితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వర్మ కేసు నమోదు చేయగానే దాదాపు 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొంత సేపటి తరువాత వారిని రిలీజ్ చేశారు. స్పందించిన ఆర్జీవి మీడియాతో మాట్లాడుతూ తాను గాజులు తొడుక్కొని కూర్చోలేదు అంటూ యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కదా అందుకే నా స్టైల్ లో సమాధానం ఇచ్చానని అన్నారు. పవర్ స్టార్ సినిమాపై మరో వివరణ ఇస్తూ.. నేను పవన్ కళ్యాణ్ పై సినిమా తీసి ఉండకపోవచ్చు.

కానీ ఆ సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారు. నమ్మకం లేకపోతే సినిమా చూసిన తరువాత మాట్లాడండి అంటూ వర్మ వివరణ ఇచ్చారు.ప‌నిలోప‌నిగా వ‌రుస ఇంట‌ర్వూల ద్వారా త‌న సినిమాను మ‌రింత ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు.సోషల్ మీడియాలో కూడా గ్యాప్ లేకుండా ట్వీట్స్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసురుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *