కల్వకుంట్ల కోటపై కాషాయ జెండా: పతన సంకేతం?

ఊహించినట్టే.. తెలంగాణలోని సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నక ఫలితం వెలువడింది. ఈ స్థానంపై కాషాయ జెండా ఎగిరింది. ఈ నియోజకవర్గంలో పాగా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలపడుతోందనే సంకేతాలను పంపించింది. ఏ రాష్ట్రంలోనైనా ఉప ఎన్నికలు జరిగాయంటే అవి అధికార పార్టీకి అనుకూలంగా వెళ్తుంటాయి. మెజారిటీ రాష్ట్రాల్లో జరిగే ప్రక్రియే ఇది. అలాంటిది- ప్రత్యేక తెలంగాణ సాధించిన మొనగాడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక ఉప ఎన్నిక ఫలితం వెలువడటం అనేది అసాధారణంగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *