కేంద్రం నూత‌న విద్యా విధానాన్ని వ్య‌తిరేకించిన డిఎంకే

కేంద్రం నూత‌న విద్యా విధానాన్ని వ్య‌తిరేకించిన డిఎంకే పార్టీ తీవ్రంగా వ్య‌తిరేకించింది.రాష్ట్రంలో హిందీ, సంస్కృతంను విధించే ప్ర‌య‌త్నంగా ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ అంశంలో సారుప్య‌త గ‌ల రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. కొత్త విద్యా విధానం భారీ సంస్కరణలు తెర‌తీయ‌డం కాద‌ని, పాత అణచివేత మనుస్మృతిపై నిగనిగలాడే కోటు అని స్టాలిన్ ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో కేంద్ర‌ ప్రభుత్వ ఇటువంటి ప్ర‌జా వ్య‌తిరేక‌ విధానాలపై పోరాడ‌నున్న‌ట్లు తెలిపారు.దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందన్నారు. జమ్ముక‌శ్మీర్‌లో రాజకీయ వ్యక్తులను అనైతికంగా నిర్బంధించడం గురించి స్టాలిన్ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. విజ‌య‌వంతంగా న‌డుస్తున్న 10 + 2 వ్యవస్థను కాద‌ని 5 + 3 + 3 + 4 ను ఎందుకు తీసుకువ‌స్తున్నార‌ని ఆయన ప్రశ్నించారు. పిల్లలకు వృత్తి విద్యను అందించ‌డంపై ఆయ‌న స్పందిస్తూ వారిపై అది మానసిక దాడిగా అభివర్ణించారు. సిల‌బ‌స్ నుండి విశ్వ‌విద్యాల‌యాల వ‌ర‌కు కేంద్రం త‌న నియంత్ర‌ణ‌లోకి తీసుకుంటుంద‌న్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *