Tech News

header ads

మూడు రాజధానుల వ్యవహారంలో మరో ట్విస్ట్


ఏలూరు సభలో సీఎం జగన్ మూడు రాజధానులపై మరోసారి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సభలో ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎక్కువగా మాట్లాడిన సీఎం జగన్... చివరిలో మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చేలా పరోక్షంగా మాట్లాడారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని... అన్ని ప్రాంతాలు బాగుండాలని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు ఈ ప్రతిపాదికన జరుగుతాయని స్పష్టం చేశారు. తమకు అంతా సమానమే అని సీఎం జగన్ తెలిపారు. అందరికీ నీళ్లు, నిధులు, పరిపాలన దక్కాలని అన్నారు. రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగానూ అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.

గతంలో తీసుకున్న అన్యాయమైన నిర్ణయాలను సరిదిద్దుతున్నామని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలు కలిసి ఉండేలా చూస్తామని వ్యాఖ్యానించారు. తనకు అందరి దయతో దక్కిన సీఎం పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments